
తెలంగాణ మిర్రర్,మాదాపూర్ : రాష్ట్ర ప్రభుత్వం.. మైనారిటీ సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు.గురువారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని మాదాపూర్ డివిజన్ ఆదిత్య నగర్ ఈద్గా వద్ద సామూహిక ప్రార్ధనలో జగదీశ్వర్ గౌడ్ పాల్గొని బక్రీద్ సందర్భంగా జరిగిన ప్రార్థనలలో పాల్గొన్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భక్తి, త్యాగం, కరుణలకు బక్రీద్ ప్రతిరూపమని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. సమాజ హితాన్ని కోరుకునే పర్వదినమని ఆయన చెప్పారు.సర్వమత సౌభ్రాతృత్వానికి తెలంగాణ ప్రతీకగా నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు మాదాపూర్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,జనరల్ సెక్రటరీ సాంబశివరావు, మైనారిటీ నాయకులు షోయబ్, అహ్మద్,లియాఖత్ ,రహీం, బాబూమియా, సలీం, ముక్తర్, మియన్, రెహ్మాన్, రాములు యాదవ్,ఖాజా,మూర్తి,జయ సాయి,రాజు తదితరులు పాల్గొన్నారు.