Home » బండి సంజయ్‌ పాదయాత్ర వాయిదా…

బండి సంజయ్‌ పాదయాత్ర వాయిదా…

by Admin
420Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర వాయిదా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఈ నెల 24 నుంచి నిర్వహించే పాదయాత్ర వాయిదా పడింది. ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ మరణం వల్ల కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్టు బండి సంజయ్‌ ప్రకటించారు. పార్టీ పరంగా సంతాపదినాలు పాటిస్తున్నట్టు తెలిపారు. మాజీ సైనికాధికారులు పార్టీలో చేరే కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసినట్టు వెల్లడించారు. కల్యాణ్‌సింగ్‌ మృతి పట్ల బండి సంజయ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీలో ఎంతో క్రమశిక్షణతో నడుచుకున్నారని, ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కల్యాణ్ సింగ్‌ బతికి ఉన్నంతకాలం అయోధ్యలో శ్రీరాముడి భవ్య రామాలయం కోసం తపించారని తెలిపారు. యూపీకి రెండు సార్లు సీఎంగా, రాజస్థాన్‌ గవర్నర్‌గా సేవలందించారని గుర్తు చేశారు. ఆయన మరణం భాజపాకు తీరని లోటని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment