Home » ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం

by Admin
10.3kViews
100 Shares

 

 

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:  ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ,”జాతీయ వైద్యుల దినోత్సవం” సంఘ సేవకులు బిల్డర్ తూనిక రాఘవేంద్రరావు సౌజన్యంతో, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ భవనం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.సి. రాయ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు తదనంతరం ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటల్స్ లో ఉత్తమ వైద్య సేవలు అందించినటువంటి వైద్యులకు డాక్టర్ బి సి రాయ్ పురస్కారాలు (జ్ఞాపిక, దుశ్శాలువ, పుష్పగుచ్చాలు మరియు పగిడీలు) ఇచ్చి సత్కరించారు. తదనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసినటువంటి అపోలో హాస్పిటల్ కార్డియాలజీ విభాగ అధిపతి డాక్టర్ రధ్ మరియు ఆచార్య B. J. రావు, వైస్ ఛాన్సలర్, హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ,

ఈ సందర్భంగా మాట్లాడుతూ  జులై ఒకటవ తారీఖున మన దేశమంతట జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మనం భూమి మీదకు రావడానికి ముందు డాక్టర్ సహాయం అవసరం ఉంటుంది. మనం పుట్టి పెరిగి పెద్దయిన తర్వాత కూడా వైద్యుల యొక్క సహాయం అవసరం అవుతూ ఉంటుంది. అందుకే మన పెద్దలు ‘వైద్యో నారాయణ హరి’ అంటూ ఉంటారు. కావుననే ఈ సమాజంలో అధ్యాపక వృత్తి తర్వాత కులమత ప్రాంతాలకతీతంగా అందరూ గౌరవించే వృత్తి వైద్య వృత్తి అని అన్నారు. ఈరోజు డాక్టర్ బి సి రాయ్ జన్మదినం. స్వాతంత్ర సమరయోధుడిగా, కలకత్తా మేయర్ గా ఆచార్యులుగా, ఉపకులపతిగా, శాసనసభ్యుడుగా, పశ్చిమబెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు విశేషమైన సేవలు అందించినారు. అందుకుగాను పాలనా రంగంలో, వైద్యరంగంలో, విశేషమైన సేవలు అందించినందుకు గాను, ఆయన గౌరవార్థం భారతరత్న బిరుదును ప్రధానం చేయడంతో పాటు, ఆయన పేరిట వైద్యం, రాజకీయాలు, సైన్స్, ఫిలాసఫీ, సాహిత్యం, మరియు కళా రంగాలలో అద్భుతమైన సేవలు అందించిన వారికి బీ.సీ.రాయ్ నేషనల్ అవార్డు ప్రదానం చేయించడంతోపాటు, ఆయన జన్మదినం అయిన జులై ఒకటవ తారీకును జాతీయ వైద్యుల దినోత్సవంగా ప్రకటించి, అమలు చేయుచున్నది అని తెలిపారు. ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం నినాదం ఆరోగ్యవంతమైన దేశాన్ని తయారు చేయడంలో వైద్యులు చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు డాక్టర్ బి సి రాయ్ ఎం ఆర్ సి పి & ఎఫ్ ఆర్ సి ఎస్ లో కేవలం రెండు సంవత్సరాల మూడునెలల కాలంలో పూర్తిచేసిన ప్రతిభావంతుడైన విద్యార్థి. డాక్టర్ బి. సి. రాయ్ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా వైద్యవృత్తిని కొనసాగించారు. మహాత్మాగాంధీ వ్యక్తిగత వైద్యులుగా కూడా పనిచేశారు. కలకత్తా, పశ్చిమ బెంగాల్లో అనేక వైద్య కళాశాలలు, అనేక నర్సింగ్ హోమ్ లు, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారు. సామాన్యుడికి మెరుగైన వైద్యాన్నికి సౌకర్యాల కల్పన ఏర్పాటు చేయటానికి ఐ.ఎం.ఏ.(ఇండియన్ మెడికల్ అసోసియేషన్)లో కీలకపాత్ర వహించారు. ఎం.సీ.ఐ. (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ఏర్పాటులో ప్రధానపాత్ర పోషించారు డాక్టర్ బి. సి. రాయ్ ఉత్తేజకరమైన చిరస్మరణీయమైన జీవితాన్ని గడిపారు.

వైద్యరంగమే సేవారంగం. కాలానుకూలంగా వైద్య వృత్తి వ్యాపారంగా మారిన తర్వాత, వైద్యం పేదవానికి అందనంత ఎత్తుకు ఎదిగిన తరుణంలో, నేటి యువ వైద్యులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, రోగి పర్స్ మీద ద్యాస తగ్గించి, పల్స్ మీద దృష్టి సారించాలని అన్నారు. ప్రస్తుతం మానవుని యొక్క జీవనశైలిలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. పర్యావరణలో వస్తున్న పెను మార్పులవల్ల, మానవునికి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. కావున ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే, కొద్దిపాటి జాగ్రత్తలు మనం తీసుకున్న యెడల మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ నిత్యము శారీరిక వ్యాయామము (యోగా, నడక, ఆసనాలు, ధ్యానం,) విధిగా చేయాలి. సాధ్యమైనంత మేరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, మిల్క్, మిల్క్ ప్రొడక్ట్స్, తృణధాన్యములు, డ్రై ఫ్రూట్స్, చాపలు, గుడ్లు, పీచుపదార్థం కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. ఆల్కహాల్, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, మాదకద్రవ్యాలు, రెడ్ మటన్ వినియోగానికి దూరంగా ఉండాలని, అప్పుడే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని అన్నారు. ఆరోగ్యం పట్ల ఎటువంటి అశ్రద్ధ చేయకుండా, అనారోగ్యంగా ఉంటే, వెంటనే డాక్టర్ని సంప్రదించి, అతని సూచనలు సలహాలు పాటించి, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డాక్టర్స్ ఫోరం కన్వీనర్ డాక్టర్ రవీంద్ర కుమార్, టి. రాఘవేంద్ర రావు మరియు ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వరరాజు, విష్ణు ప్రసాద్, జనార్ధన్, పాలం శ్రీను, G. V. రావ్, వాణి సాంబశివరావు, ఉమా చంద్రశేఖర్, బాలన్న, జిల్ మల్లష్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment