
*ఏడుగురు నిందుతులను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు..
తెలంగాణ మిర్రర్, గచ్చిబౌలి : ఫేక్ ఫింగర్ ప్రింట్స్ తయారు చేసి పలువురి అకౌంటు ల నుండి డబ్బులు డ్రా చేస్తున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సైబరాబాద్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ కమిషనర్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలును వెల్లడించారు.
కర్నూలు జిల్లా కు చెందిన వెంకటేష్ గతంలో కర్నూలు కలెక్టరేట్ లో డాటా ఎంట్రీ లో పనిచేసేవాడని అతను ల్యాండ్ డాక్యుమెంట్స్, బ్యాంకు డాక్యుమెంట్స్ తయారు చేయడంలో అనుభవం ఉందన్నారు. వెంకటేష్ కొంతకాలంగా బీరంగూడ లో ఉంటూ ఈ దందా కొనసాగించాడు. ఏపీ స్టేట్ పోర్టల్ IGRS లోని డాక్యుమెంట్స్ లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ తయారు చేసి AEPS (ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సర్వీసు) ద్వారా బ్యాంకు ఎకౌంటు హోల్డర్స్ మనీ విత్ డ్రా చేశారు.. APES అప్లికేషన్ సర్వీస్ ప్రోవైడర్ అయినటువంటి రాయ్ నెట్ సొల్యూషన్ నుండి అప్పాయింట్ ఇండియా పేరుతో ఎజెన్సీ తీసుకున్నాడు. శంకర్ నాయక్, శ్రీనివాస్, సామేలు, మణికంఠ, ఖాసీం, అనిల్ కుమార్ ల నుండి తనకు కావలసిన ఆధార్ కార్డులు, బ్యాంకు ఎకౌంట్స్ డీటెయిల్స్ తీసుకుని ఆ అకౌంట్ల నుండి డబ్బులు డ్రా చేసేవాడు. వారి నుండి మూడు లక్షల నగదు, 2500 ఫేక్ ఫింగర్ ప్రింట్స్, 121 సిమ్ కార్డ్స్, 20 మొబైల్స్, డెబిట్, ఆధార్, పాన్ కార్డులు, బయోమెట్రిక్ స్కానర్లు, ఏడు కేజీల ఫింగర్ ప్రింట్స్ లిక్విడ్ సీజ్ చేశామన్నారు. ఈ ముఠా మొత్తం 140 మంది బ్యాంకు ఎకౌంట్స్ కు సంబంధించి వారి ఫేక్ ఫింగర్ ప్రింట్స్ తో డబ్బులు విత్ డ్రా చేశారని పేర్కొన్నారు. వెంకటేష్ కు సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు.