Home » ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు : చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు : చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

by Admin
460Views

*ఆర్టీసీ కాలనీలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన 

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని
ఆర్టీసీ కాలనీలో రూ.20 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణపనులకు కౌన్సిలర్ మహాదేవ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన స్థానికులను కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో అమీన్‌పూర్ మున్సిపల్ ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు చేపట్టాలని, సకాలంలో పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్ కు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్ లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment