Home » ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్,రామచంద్రపురం : మహిళలు ప్రస్తుత సమాజంలో అన్ని రంగాల్లో రాణించాలని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు,అమీన్‌పూర్ వార్డు సభ్యురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్,రామచంద్రపురం డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ లు అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం పట్టణంలోని బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కాట సుధా శ్రీనివాస్ గౌడ్,కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.ముందుగా వారు మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరారు. రాజకీయంగా, ఆర్ధికంగా,వ్యాపారరంగాల్లో రాణిస్తున్న మహిళలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు.

You may also like

Leave a Comment