Home » ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ  పార్థివ దేహానికి నివాళులర్పించిన బీజేపీ నాయకులు

ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ  పార్థివ దేహానికి నివాళులర్పించిన బీజేపీ నాయకులు

by Admin
9.1kViews
132 Shares

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించిన బీజేపీ జాతీయ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, చేవెళ్ళ మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్ర రెడ్డి,గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వారు మాట్లాడుతూ అనేక గొప్ప చిత్రాలలో నటించి అనేకమంది అభిమానుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారని అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఐదున్నర దశాబ్దాలకుపైగా తెలుగు తెరను ఏలిన నటశేఖరుడు, సంచలన నిర్ణయాలతో అంతకు మించిన పట్టుదలతో వెండి తెరపై హేమాహేమీలను ఢీకొట్టిన ఘనుడు, పౌరాణికం, జానపదం, సాంఘికం, చారిత్రకం ఇలా ప్రతి సినిమాలో తనదైన ముద్రవేసిన కృష్ణ  తెలుగోళ్ల జేమ్స్ బాండ్ గా, కౌబాయ్ గా అలరించి అహో అనిపించుకున్నారు. తెలుగుతెర ఎరుగని ఎన్నో హంగులు పరిచయం చేసి మన వెండితెర స్థాయిని ఆమాంతం పెంచేశారు. సెల్ఫ్ మేడ్ హీరోగా ఎదిగి 340కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ అగ్రపథంలో కొనసాగుతున్న సమయంలోనే పద్మాలయ పిక్చర్స్ స్థాపించి చరిత్రలో నిలిచిపోయే చిత్రరాజాలెన్నింటినో నిర్మించిన కృష్ణ జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం అన్ని అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.

You may also like

Leave a Comment