Home » ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సైవలు : మంత్రి హరీశ్‌ రావు

ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సైవలు : మంత్రి హరీశ్‌ రావు

by Admin
9.7kViews
91 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : ఆరోగ్య తెలంగాణ కోసం కృషిచేద్దామని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. శనివారం కొండాపూర్‌ ప్రభుత్వ దవాఖాన నుంచి వర్చువల్‌గా 134 వైద్య పరీక్షలను 134 వైద్య పరీక్షలను విప్,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ,ఎమ్మెల్సీలు బాను ప్రసాద్, బండ ప్రకాష్ , తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ , తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా , జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్ , హెల్త్ కమిషనర్ , శ్వేతా మెహతి , డీఎంహెచ్ఓ వెంకటేశ్వర రావు లతో కలిసి మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సైవలు, పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతున్నాయని తెలిపారు. టీ-డయాగ్నొస్టిక్స్‌లో 134 వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయన్నారు. టీ-డయాగ్నోస్టిక్స్‌ ద్వారా 134 పరీక్షలు ఉచితంగా చేస్తున్నామన్నారు. అన్ని పీహెచ్‌సీల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ సృజన,, కార్పొరేటర్లు హమీద్ పటేల్ , జగదీశ్వర్ గౌడ్ ,దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ , కొండాపూర్ ప్రభుత్వ డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్ సూపెర్నినెంట్ వరదచారీ, కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్ , ఆయా డివిజన్ల అధ్యక్షులు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి,సమ్మారెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గౌతమ్ గౌడ్, వాలా హరీష్ రావు, మరియు సీనియర్ నాయకులు ఊట్ల కృష్ణ కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పెరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె. బలరాం యాదవ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా, రవీందర్ రెడ్డి, ప్రసాద్, గౌరీ, నిర్మల, నరసింహ సాగర్, రాజు యాదవ్, శ్రీనివాస్ చౌదరి, గువ్వల రమేష్, మల్లెల శ్రవణ్ యాదవ్, బుడుగు తిరుపతి రెడ్డి, సిద్ధిక్ నగర్ ప్రెసిడెంట్ బసవరాజు, మంగళరాపు తిరుపతి పటేల్, రజనీకాంత్, తిరుపతి యాదవ్, సాయి శామ్యూల్ కుమార్, న్యూ పీజెఆర్ నగర్ ప్రెసిడెంట్ వెంకటి, నరేష్ ముదిరాజ్, గణపతి, అశోక్ సాగర్, రమేష్, డా రమేష్, సాగర్ చౌదరి, ఆనంద్ చౌదరి, ఎర్ర రాజు, ఏండీ జహీర్ ఉద్దీన్, జుబెర్, వసీమ్, సాయి బాబు సాగర్, ఏండి ఖాసీం, సంజీవ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment