
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా వరంగల్ లో ₹6,100 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ భహిరంగ సభకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెంట్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బిజెపి శ్రేణులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జానకిరామరాజు, కొరదల నరేష్,, రవీందర్ రావు ,మాణిబూషన్ ,రెడ్డి ప్రసాద్ ,నవీన్ ,చారీ ,,ప్రశాంత్ , రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళా మోర్చా, మైనార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. విజయ సంకల్ప సభకు ర్యాలీగా తరలి వెళ్లే ముందు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొవ్వా సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్రానికి రైల్వే వాగన్ తయారు చేసే పరిశ్రమ నెలకొల్పడం దాని ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం అలాగే జాతీయ రహదారులు విస్తరణ వాటికి కనెక్టివిటీ రోడ్లు ఏర్పాటు చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.