Home » ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా దక్కింది : జ్ఞానేంద్ర ప్రసాద్

ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా దక్కింది : జ్ఞానేంద్ర ప్రసాద్

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : నిరుపేదలైన బీసీలకు సీఎం కేసీఆర్ బీసీ బంధు ఇవ్వాలని ఓబీసీ మోర్చా రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.మంగళవారం ఓబీసీ మోర్చా హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన డివిజన్ బీజేపీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించి పూర్తి స్థాయి కమిటీని నియమించారు.ఈ కార్యక్రమానికి ఓబీసీ మోర్చా రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని ఓబీసీ మోర్చా కమిటీలో నియమితులైన వారికి నియామక పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓబీసీ మోర్చా డివిజన్ కమిటీలో నియమితులైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా దక్కిందని తెలిపారు. బీసీలకు నిధులు కేటాయించకుండా భారీగా నిధులు కేటాయించామని గొప్పలు చెప్పుకుంటూ ,ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించి కేవలం 10% మాత్రమే ఖర్చు చేస్తూ ఏడేండ్లుగా బీసీలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తున్నాడని అన్నారు. ఇలాగె కొనసాగితే తిరుగుబాటు తప్పదు అని హెచ్చరించారు. నిరుపేదలైన బీసీలందరికీ బీసీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలలో ఒక్కటీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదన్నారు.50 శాతం ఉన్న బీసీలను కేవలం కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారు అని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు, రాష్ట్రంలో ఉన్న అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ అసెంబ్లీ కన్వీనర్ పృథ్వి గౌడ్,బీజేపీ డివిజన్ అధ్యక్షులు శ్రీధర రావు,నాయకులు రవి గౌడ్,కోటేశ్వర రావు, ఉపాధ్యక్షులు అశోక్ ,రవి ముదిరాజ్, మల్లేష్,నవీన్ కుమార్,రామారావు,నాగలక్ష్మి, జానీ,రామ చంద్రుడు, రవి,ఆంజనేయులు, సత్యం, చంద్రశేఖర్, గోపి, మహేష్, నరసింహ రావు, రుద్రవీర్,మధు,నాయకులు,కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment