Home » సమాజం కొరకు ప్రతి ఒక్కరు చేయూతనందించాలి : అరెకపూడి గాంధీ

సమాజం కొరకు ప్రతి ఒక్కరు చేయూతనందించాలి : అరెకపూడి గాంధీ

by Admin
1.0kViews

తెలంగాణ మిర్రర్, గచ్చిబౌలి:  గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల కి చెందిన తెరాస నాయకులు శ్రీ సత్యనారాయణ జన్మదినం సందర్భంగా శాలవ తో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్బంగా సత్యనారాయణ తన జన్మదినంను పురస్కరించుకుని కృష్ణ కాలనీ కి సీసీ కెమెరాల ఏర్పాటు కోరకు తన వంతు సహాయంగా 20,000 రూపాయల ఆర్థిక సహాయం ను విరాళంగా గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా కాలనీ వాసులకు అందజేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సత్యనారాయణ జన్మదినం సందర్భంగా ఎటువంటి హంగు ఆర్భాటాలు చేసుకోకుండా కృష్ణ కాలనీ లో సీసీ కెమెరాల ఏర్పాటుకు తన వంతు సహాయంగా 20,000/-రూపాయల ఆర్థిక సహాయం ను విరాళంగా అందచేయడం చాలా గొప్ప విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ  పేర్కొన్నారు. అదేవిదంగా సమాజము కోసం ఎదో చేయాలనే తపన వలన సమాజ హితం సమాజ సేవలు చేయడం చాల గొప్ప విషయం అని ఈ సందర్భంగా సత్యనారాయణ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రతి ఒక్కరు సమాజం కొరకు చేయూతనందించాలని ప్రభుత్వ విప్ గాంధీ కోరారు. సామాజిక దృక్పథంతో సమాజ సేవచేయడానికి ముందుకురావడం చాలా అభినందించ దగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ కాలనీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ , రాజు, మహాదేవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment