
950Views
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప లో మొబైల్ వాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ రాజీవ్ గృహకల్ప లో 18 సంవత్సరములు నిండిన వారందరికీ వాక్సిన్ ఉచితంగా అందిస్తున్నారు అని డివిజన్ ప్రజలందరూ సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. అలానే ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి కోవిడ్ నిబంధనలు పాటించాలని మరియు వాటిని అమలయ్యే విధంగా చూడాలని వైద్య సిబ్బందికి, GHMC అధికారులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప వార్డ్ మెంబెర్ శ్రీకళ, చంద్రకళ, శ్రీనివాస్, కాక, సబినకుమారి, మల్లికాంబ, బసవరాజ్, గోపినగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, మొబైల్ వాక్సిన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.