Home » ప్రతి ఒక్కరు కోవిడ్ వాక్సినేషన్ తీసుకోవాలి : జగదీశ్వర్ గౌడ్

ప్రతి ఒక్కరు కోవిడ్ వాక్సినేషన్ తీసుకోవాలి : జగదీశ్వర్ గౌడ్

by Admin
1.0kViews

తెలంగాణ మిర్రర్, (మాదాపూర్): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ నందు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వాక్సినేషన్ కార్యక్రమాన్ని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ప్రజలందరూ తప్పకుండా కోవిడ్ వాక్సినేషన్ తీసుకోవాలని, కరోన వ్యాధిని అరికట్టేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విధిగా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య నగర్ టిఆర్ఎస్ బస్తీ అధ్యక్షులు కసిం, వార్డ్ సభ్యులు రహీమ్,మైనారిటీ నాయకులు బబుమియా, సలీం,,యూత్ నాయకులు ఖాజా,అర్షద్,హఫీజ్ పేట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment