Home » ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

by Admin
10.9kViews
129 Shares

 

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి :  శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం సంతోషమని ఎంపీ డా.రంజిత్ రెడ్డి,విప్ అరెకపూడి గాంధీ అన్నారు.శుక్రవారం హుడా కేఫ్ వద్ద బిహెచ్ఈఎల్ ప్రధాన గేట్ నుండి కల్వరి టెంపుల్ రిజర్వాయర్ వరకు మంజీర రోడ్డులో రూ. 40 కోట్ల అంచనా వ్యయం తో 7 కిలోమీటర్ల మేర నూతనంగా చేపట్టబోయే మంజీర మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం పనులకు ఎంపీ డా.రంజిత్ రెడ్డి,విప్ అరెకపూడి గాంధీ కార్పొరేటర్లు పూజిత గౌడ్,జగదీశ్వర్ గౌడ్,జలమండలి అధికారులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సుమారు నాలుగు దశాబ్దాల క్రితం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తాగునీటినిసరఫరా చేసేందుకు సంగారెడ్డి శివారులోని మంజీర జలాశయం నుంచి తాగునీటి పైపులైన్లు వేశారు. పైపులు శిథిలావస్థకు చేరుకుంటుం డడంతో లీకేజీల మూలంగాతాగునీరు వృథాగా పోతోంది. పాత పైపులైన్ల స్థానంలో కొత్త లైన్లువేయాలని ఈ సమస్యను సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ ల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసారని అన్నారు.ఈ సందర్బంగా సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ ,ఎంపీ లకు విప్ గాంధీ కృతఙ్ఞతలు తెలిపారు.ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతో ఉపశమనం లభించింది అని , స్వచ్చమైన త్రాగు నీరు అందించడమే లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు , బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,వార్డు మెంబర్లు,ఏరియా,కమిటి మెంబర్లు,బూత్ కమిటి మెంబర్లు,కాలనీ వాసులు,కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment