
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే అభివృద్ధి కొనసాగుతుందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని నాగార్జున రెసిడెన్సీ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ఆయన హాజరయ్యారు. అనంతరం హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రజయ్ సిటీలో డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, పార్టీ కార్యకర్తలు,నాయకులు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో వేల కోట్లతో వ్యయంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే అభివృద్ధి కొనసాగుతుందన్నారు. ఎంతో మందికి సంక్షేమ ఫలాలను అందిస్తున్న ప్రభుత్వాన్ని మళ్లీ ఆదరించి, గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ప్రలోభ పెట్టి, అమలు చేయలేని పథకాలను ప్రజల్లోకి తీసుకురావాలని చూస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మురిగిపోతుందని, అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలు ఆగమవుతారని, తెలంగాణ రాకముందు పడిన కష్టాలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో నాగార్జున రెసిడెన్సీ ప్రతినిధులు రామరాజు ,సత్యనారాయణ రాజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ , రామరాజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు ,అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.