
తెలంగాణ మిర్రర్, గచ్చిబౌలి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ, తాజ్ నగర్, గోపన్ పల్లి తండా గోపన్ పల్లి గ్రామం ప్రాంతాల్లో గత ఏడాదిన్నర నుండి రోడ్డు మరమత్తు పనుల నిమిత్తం అస్తవ్యస్తంగా మారిన రోడ్డు వల్ల ప్రజలు ఇక్కట్లకు గురి అవుతున్నారని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ…. గోపన్ పల్లి నా స్వంత గ్రామం కార్పొరేటర్ ఎలక్షన్స్ సమయంలో పాదయాత్రలో భాగంగా ప్రజలకు ఈ రోడ్డు సమస్య లేకుండా చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది. గత ఎనిమిది నెలల నుండి ఆర్ & బి అధికారులకి, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ 50 సార్లు ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. అయినప్పటికీ ఈ రోడ్డు కాంట్రాక్టర్ తెరాస పార్టీకి చెందిన స్థానిక ఎంపీ అవటంతో అటు ప్రభుత్వ అధికారులు స్థానిక ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోవటం వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే రాస్తారోకో ధర్నాలు చేయటం ఖాయం అని గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ సమస్యకు కారణమైన కాంట్రాక్టర్ యొక్క టెండర్ వెంటనే తొలగించి, రీ టెండర్ వేయాలని, అధికారులు భాద్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షులు బి విటల్, కార్యదర్శి నరసింహారెడ్డి ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం, మహమ్మద్ ఖలీల్, గోపనపల్లి తండ వడెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, వైస్ ప్రెసిడెంట్, శంకర్ నాయక్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నగేష్, నవ చైతన్యం యూత్ అసోసియేషన్ కమిటీ మెంబెర్స్ , సీనియర్ నాయకులు, నర్సింగ్ నాయక్, ప్రకాష్, బాబు రావు, కృష్ణ నాయక్, గోవింద్ నాయక్, తిరుపతి నాయక్, రాజు , శ్రీశైలం నాయక్, రవినాయక్, బాబు నాయక్, నరేందర్ నాయక్, గోవర్ధన్ నాయక్ స్థానిక నేతలు కార్యకర్తలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.