
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర రెండవ రోజు షేక్‌పేట్ నాళానగర్ లో పాల్గొన్న రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి .ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ త్యాగాలతో సాధించుకున్న మన రాష్ట్రం స్వార్థపరుల చేతుల్లో బందీ అయ్యింది. ఆ సంకెళ్ళు పగులగొట్టి అమరుల ఆశయాల్ని నెరవేర్చేందుకు చేపట్టిన ఈ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ మార్పునకు నాంది అన్నారు. రాష్ట్రంలో రాజకీయ మార్పునకు ఈ యాత్ర వేదిక కానుందని చెప్పారు. అమరుల ఆకాంక్షలకు, ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో ఒక్క కుటుంబమే పాలన సాగిస్తోంది. సీఎం కేసీఆర్ హయాంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. మాటలతో మభ్యపెడుతూ కేసీఆర్ పబ్బం గడుపుతున్నారు. రైతులందరికీ ఉచిత యూరియా ఇస్తానని చెప్పి రైతులను మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగ యువకులను మోసగించారు. ఏడెనిమిది ఏళ్లు దాటినా ఇంత వరకు వాటి గురించి పట్టించుకోలేదు. దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని సీఎం చేస్తానన్న హామీని సీఎం కేసీఆర్.. అటకెక్కించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్ , చందానగర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ కసిరెడ్డి సింధు రఘునాథ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి, సీనియర్ నాయకులు, కృష్ణ యాదవ, శ్యామ్ యాదవ్, విఠల్, శ్రీరాములు, సుబ్రమణ్యం కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, హరీష్ శంకర్ యాదవ్, కిషన్ గౌలి, ప్రకాష్ ,రంగస్వామి, మధు, ప్రశాంత్, ప్రసాద్, సురేష్, , శ్రీకాంత్, ముర్గ, నరేష్, రమణ, సురేష్ శ్రీను, రాజు, క్రాంతి, నర్సింగ్ రావు బిజెపి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.