
తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు :ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. బొల్లారం మున్సిపాలిటీ కి చెందిన ఎం దిగంబర్ రావుకి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.60 వేల చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే జిఎంఆర్ లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.అదే విధంగా మెరుగైన వైద్య చికిత్స కోసం అమీన్‌పూర్ మున్సిపాలిటీ కి చెందిన ఎం.రమాదేవి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకుంది.దీంతో ఆమెకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరైంది.ఈ మేరకు గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రమాదేవి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎల్ఓసి పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపాలిటీ కౌన్సిలర్,తెరాస సీనియర్ నాయకులు చంద్రారెడ్డి,పార్టీ మున్సిపల్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి,రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య తదితరులు ఉన్నారు.