
10.3kViews
101
Shares
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : ప్రజల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ పార్టీ కారుగుర్తుకు ఓటువేసి గెలిపించాలని శేరిలింగంపల్లి అభ్యర్థి అరెకపూడి గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ లో కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ఆయన పాదయాత్రచేసి.. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిపనులతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలుపరుస్తుండ డంతో వివిధ పార్టీల నుంచి నాయకులు బీఆర్‌ఎస్‌లో చేర డం హర్షణీయమని, వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామని అ న్నారు. ప్రజలను పట్టించుకోని పార్టీలకు ఓటు వేయవద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు ,అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.