
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ లో పర్యటించిన స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆదర్శ్ నగర్ రోడ్డు 3 లో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. డివిజన్ ను దశల వారీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టి సకాలంలో పూర్తి చేయాలనీ కాంట్రాక్టర్ కు,అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ సునీల్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, తెరాస నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలు వల్ల ఎన్నో ప్రయోజనాలు: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించొచ్చని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలోని ఆరంభ టౌన్ షిప్ లో అసోసియేషన్ సభ్యులు సొంత నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాలు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, నేరాలను, ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉందని అన్నారు. ఈ సందర్బంగా ఆరంభ టౌన్ షిప్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర రాథోడ్, అసోసియేషన్ ట్రెజరర్ నరేంద్ర కుమార్, జాయింట్ సెక్రెటరీ మహిపాల్ యాదవ్ , ఆరంభ టౌన్షిప్ టిఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు బసవయ్య, ఆరంభ ప్రధాన కార్యదర్శి విక్రమ్ యాదవ్ ఉపాధ్యక్షులు రాజశేఖర్ గౌడ్, టౌన్షిప్ మహిళా విభాగం అధ్యక్షురాలు అరుణ విక్రమ్ యాదవ్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు నయీమ్ ఉద్దీన్, ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి ఉపాధ్యక్షులు డి.సరిత, ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.