Home » ప్రజల మౌలిక సదుపాయాలలో రాజీలేని ప్రభుత్వం టిఆర్ఎస్ : అరెకపూడి గాంధీ

ప్రజల మౌలిక సదుపాయాలలో రాజీలేని ప్రభుత్వం టిఆర్ఎస్ : అరెకపూడి గాంధీ

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని అంబిర్ చెరువు నుండి ఎల్లమ్మ చెరువు వరకు  రూ. 6 కోట్ల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న నాల విస్తరణ పనులలో భాగంగా రాంకీ పెరల్ వద్ద జరుగుతున్న నాల విస్తరణ పనులను, భీముని కుంట చెరువు నుండి నాల వరకు జరుగుతున్న పనులను ప్రాజెక్ట్ అధికారుల తో కలిసి పరిశీలించిన  ప్రభుత్వవిప్ శ్రీ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ వర్షకాలం ను దృష్టిలో పెట్టుకొని నాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. కరోనా వంటి విపతర్క పరిస్ధితుల్లో అభివృద్ధి, సంక్షేమం అగకూడదనే ఉదేశ్యం తో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తున్నామని, అదేవిధంగా వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రజా అవసరాల దృష్ట్యా నాలా విస్తరణ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, నాల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాలా నిర్మాణ పనుల పై పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది.  గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాలలో  నీటి నిల్వలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కల్గకుండా సన్నద్ధం కావాలని ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముంపుకు గురికాకండా ముందస్తుగా తగు చర్యలు తీసుకోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని ఆయన కోరారు. అదేవిధంగా కరోనా వ్యాధి విస్తరణ నేపథ్యంలో ప్రతి ఒక్కరు బాధ్యత గా ఉండలాని, వైరస్‌వ్యాప్తి చెందకుండా బయటికి వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం తప్పక పాటించాలని, శానిటైజర్లను ఉపయోగించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, అవసరం అయితే తప్ప బయటకి రావద్దని ప్రభుత్వ విప్ గాంధీ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్స్ EE కిష్టప్ప , DE రాంచందర్, మాదాపూర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, రాంకీ పెరల్ వాసులు సుబ్రమణ్యరెడ్డి, సురేష్ బాబు, భాస్కర్ రెడ్డి, బాలమూర్తి, అమర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment