Home » ప్రజల్లో స్పూర్తిని ప్రజా యుద్ధనౌక గద్దర్ : బండి రమేష్

ప్రజల్లో స్పూర్తిని ప్రజా యుద్ధనౌక గద్దర్ : బండి రమేష్

by Admin
9.0kViews
83 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : ప్రజల్లో స్పూర్తిని ప్రజా యుద్ధనౌక గద్దర్ ఇక లేరు. గద్దర్ మరణం పట్ల చాలా మంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు మంగళవారం మియాపూర్ లోని పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ప్రజాకవి గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గొప్ప కళాకారుడిని కోల్పోయామన్నారు. గద్దర్ మృతి తెలంగాణ సమాజానికి తీరన లోటని చెప్పారు.’ప్రజా గాయకుడు గద్దర్ మన మధ్యన లేకున్నా.. ఆయన ఆట, మాట, పాట ఎప్పటికీ మన మధ్యన సజీవంగానే ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున శర్మ, గంగారం సంగారెడ్డి, శేఖర్ గౌడ్, శంకర్ నాయక్, తెప్ప బాలరాజ్, సలీం భాయ్, సిల్వర్ మనీష్, కృష్ణ గౌడ్, సాయన్న, అంజద్ అమ్ము, మురళి, అరుణ, పూజ, పద్మ, మోహిని, సత్యారెడ్డి , శంకర్రావు,రమణ, గౌస్ బాయ్ తదితరులు పాల్గొని గద్దర్ కు నివాళులు అర్పించారు.

You may also like

Leave a Comment