
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ అన్నారు.శుక్రవారం నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లి, గోపన్ పల్లి తండా, ఎన్టీఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో గడప గడప కు రఘన్న కార్యక్రమం నిర్వహించారు.ముందుగా సేవాలాల్ మహారాజ్ కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పతకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ ప్రజల బతుకులు మార్చేందుకు ఆరు గ్యారెంటీలను ప్రకటించారని అవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి అన్నారు. ఆరు గ్యారంటీలపై ప్రజల్లో కాంగ్రెస్ పట్ల పూర్తి విశ్వాసం కలిగిందని కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ నాయకులు, కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు