Home » ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ద్యేయం : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ద్యేయం : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:   హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కింది కుంట చెరువు వద్ద గల పార్క్ సుందరికరణ పనుల కొరకు శనివారం పార్క్ ను  కార్పొరేటర్లు శ్రీ నార్నె శ్రీనివాసరావు , శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ శ్రీ అరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పార్క్ ను అన్ని రకల మౌలిక వసతుల తో సకల సౌకర్యాలతో ,అన్ని హంగుల తో సుందర వందనంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. చుట్టుపక్కల ప్రజలకు ఈ పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఇందులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ద్వారా ఉదయం ,సాయంత్రం వాకింగ్ కు వచ్చే పిల్లలు ,పెద్దలు , వృద్ధులు జిమ్ చేసుకోవడానికి ఎంతగానో ఆసక్తి చూపుతారని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. పిల్లలకు ఆటస్థలం తీసుకువచ్చామని . పార్కులో చక్కటి వాతారణం ,ఆహ్లాదాన్ని పరుస్తాయి అని, మనసు కి ప్రశాంత త చేకూరుతుంది, చిన్న పిల్లలకు ఆటవిడుపుగా ,పెద్ద వారికి సేద తిరడానికి పార్క్ లు ఎంతగానో తోడ్పడుతాయి అని కాంక్రీట్ కి కారణ్యం లో పార్కులు ఆరోగ్యనికి ఎంతగానో దోహదపడుతాయి అని , ప్రతి ఒక్కరు మొక్కలు నాటి మన పరిసరాలను మనమే కాపాడుకోవాలనే ఒక సామజిక దృక్పథం అలవాటుపడాలని ఆయన సూచించారు. పార్క్ ల అభివృద్ధికి కృషి చేస్తానని , ప్రతి ఒక్కరు పార్కుల అభివృద్ధికి కృషి చేయాలనీ, చిన్న చిన్న కార్యక్రమాలకు పార్క్ లు ఎంతగానో ఉపయోగపడుతాయి అని అందరూ విరివిగా మొక్కలు నాటి పార్కులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

You may also like

Leave a Comment