Home » ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కృషి

ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కృషి

by Admin
10.5kViews
149 Shares

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి :  శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్, నెహ్రునగర్ కాలనీలలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ రోడ్ల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కార్పొరేటర్ ని కోరారు. కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాజీపడే ప్రసక్తే లేదని, అభివృద్ధి ప్రజల సంక్షేమమే బిఆర్ఎస్ ప్రధమ కర్తవ్యం అని అన్నారు. కాలనీలో త్రాగునీటి సమస్యలను పరిష్కరించడంతోపాటు డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అదేవిధంగా కాలనీలో నెలకొన్న విద్యుత్ పారిశుద్ధ్య సమస్యలను అధిగమించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ మోహన్, ఎలక్ట్రికల్ లైన్మెన్ బ్రహ్మం, వాటర్ వర్క్స్ లైన్మెన్ నవీన్, ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ జగన్ మోహన్, డివిజన్ ఉపాధ్యక్షులు యాద గౌడ్, వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, గోపి నగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, దివాకర్ రెడ్డి, బసవరాజ్ లింగయత్, మల్కయ్య, రాజక్, ముంతాజ్ కాలా, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, నిరూప, ఎస్సీ ప్రెసిడెంట్ నరసింహ, తుకారం, రాజు,పిల్లి యాదగిరి, గౌసియా, అబ్దుల్ గని, నరేష్, గఫూర్, అబ్దుల్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment