Home » ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం : కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం : కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి :  గచ్చిబౌలి డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ నగర్, గోపనపల్లి తండాలో ప్రజా సమస్యలపై  కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీ బాట పట్టారు.ఇందులో  భాగంగా కాలనీలో సమస్యల గురించి ప్రజలను ఆరా తీశారు. అనంతరం కాలనీ లో నెలకొన్న సమస్యలను ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు  కార్పొరేటర్  దృష్టికి తీసుకువచ్చారు.ఇందులో భాగంగా కాలనీలో మంచి నీళ్లు, డ్రైనేజి,సీసీ రోడ్డులు,వీధి దీపాల పనితీరుపై తనిఖీ చేశారు. జిహెచ్ఎంసి అధికారులతో  మాట్లాడుతూ డ్రైనేజి, సిసి రోడ్లు, మంచి నీళ్లు, మురికి కాలువల పనుల గురించి చర్చించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చే దిశగా పని చేస్తున్నామన్నారు.డివిజన్ లోని ప్రతీ కాలనీ, బస్తీల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని త్వరగా పరిష్కరించాలని కోరారు. ఎలాంటి సమస్య ఉన్న ఇబ్బంది పడకుండా తనని సంప్రదించాలని స్థానికులకు కార్పొరేటర్  హామీ ఇచ్చారు.కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్పందిస్తూ ఇప్పటికే నిధులు కేటాయించారని,వీలైనంత త్వరగా నిర్మాణం పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఈ సునీల్,వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాధ్ ఎన్టీఆర్ నగర్, కోశాధికారి వేణు గోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ నగర్ సొసైటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం , సీనియర్ నాయకులు, మన్నే సురేష్ రాంచందర్, రవి,మాఖ్బూల్ ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు ,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment