
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : ప్రజలకు ఆరోగ్యకరమైన జీవితం అందించే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు.డివిజన్ పరిదిలోని సురభీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఓపెన్ జిమ్ పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు.ఈ సంధర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని నిత్యకృత్యంగా మార్చుకోవాలన్నారు.ప్రజలకు ఉచితంగా జిమ్ సౌకర్యం కల్పించేందుకే ప్రభుత్వమే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తుందన్నారు.వేలకు వేలు చెల్లించి ప్రైవేట్ జిమ్ములకు వెళ్లలేని పేద వారికీ ప్రయోజనం కలిగేలా మన డివిజన్ లో సురభి కాలనీ,రాజీవ్ స్వగృహ,సుదర్శన్ నగర్ లో కూడా నూతన జిమ్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.సురభి కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, మిగిలిన పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు.అంతే కాకుండా పార్కులో చిన్న పిల్లల కోసం ఆటలకు సంబంధిచిన పరికరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు వీరేశం గౌడ్,సురభీ కాలనీ అధ్యక్షులు శ్రీనివాసరావు,యూత్ ప్రెసిడెంట్ వి. చిరంజీవి,వెంకట్,రమేశ్,విజయ్, నీరజ్,కార్తిక్,లక్ష్మణ్ యాదవ్,గోపాల్ యాదవ్,రవీందర్ ఘనపురం,శ్యామ్,స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.