
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 1 ,21,000/- ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కులను బాధిత కుటుంబాలకి గురువారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి…
1.కొండాపూర్ డివిజన్ పరిధిలోని కుమ్మరి బస్తి కి చెందిన నర్సిములు కి – 60,000/-
2. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్రంగుడా కి చెందిన కిషన్ సింగ్ కి – 48,000/-
3.కూకట్పల్లి డివిజన్ పరిధిలోని దీనబంధు కాలనీ కి చెందిన రవీందర్ రెడ్డి కి – 13,000/-
అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసానిస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు , ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షలు జిల్లా గణేష్ తెరాస సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి , నాయి నేని చంద్రకాంత్ రావు , నరేష్, జగదీష్, యాదగిరి తదితరులు పాల్గొనారు.