
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల శ్రీ సోమేశ్వర దేవస్థానం శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంపదలతో విరాజిల్లుతూ అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి కోరినట్టు తెలియజేసారు. భక్తులంతా స్వామివారిని దర్శించుకుని ఆ మహాశివుని కటాక్షం పొందగలరని కోరారు. ఆ మహా శివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ ,గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి,ఎన్టీఆర్ నగర్,తాజ్ నగర్,సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షులు బి విటల్,ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం,దేవస్థాన చైర్మన్ కావాలి చెన్నం ముదిరాజ్,ఆలయ అర్చకులు సంగమేశ్వర్,గోపాల్ యాదవ్, బస్వరాజ్ లింగాయథ్,శ్రీకాంత్ యాదవ్ సీనియర్ నాయకులు విష్ణువర్దన్ రెడ్డి,శివ సింగ్,ప్రవీణ్ రాజు,రవీందర్ రాజు,కోమటి రవి,శ్రీనివాస్ రెడ్డి గుడ్డు, మున్నూరు సాయి నర్సింగ్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.