Home » ప్రజలందరూ తప్పకుండా కోవిడ్ వాక్సినేషన్ తీసుకోవాలి : ఉప్పలపాటి శ్రీకాంత్

ప్రజలందరూ తప్పకుండా కోవిడ్ వాక్సినేషన్ తీసుకోవాలి : ఉప్పలపాటి శ్రీకాంత్

by Admin
360Views

తెలంగాణ మిర్రర్,మియాపూర్ : మియాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీ నందు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్నటువంటి మొబైల్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన మియాపూర్ డివిజన్ కార్పొరేటర్  ఉప్పలపాటి శ్రీకాంత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ తప్పకుండా కోవిడ్ వాక్సినేషన్ తీసుకోవాలని, ప్రతి కాలనీ/బస్తీలో కరోనా కేసులు నేపథ్యంలో ఎప్పటికప్పుడు జి.హెచ్.ఎం.సి సంబంధిత అధికారులతో సమీక్షిస్తున్నామని, కరోన వ్యాధిని అరికట్టేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, అవసరం అయితే తప్ప బయటకి రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో తెరసనాయకులు సంతోష్ ,లక్ష్మణ్, సుబధ్ర, రాములునాయక్, వెంకట్, స్వామి, రాజు, శివ స్థానిక నాయకులు జి.హెచ్.ఎమ్.సి ఏస్ ఆర్ పి కనకరాజు, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment