
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బిహెచ్ఇఎల్ యూనిట్ సిఐఎస్ఎఫ్ ప్రాంగణంలో సీనియర్ కమాండెంట్ అఖిలేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్బంగా శుక్రవారం జరిగిన పోలీసు అమరుల సంస్కరణ దినోత్సవంలో సీనియర్ కమాండెంట్ అఖిలేష్ కుమార్ మాట్లాడుతూ అమరవీరుల యొక్క దినోత్సవ ప్రాధాన్యతను గుర్తు చేశారు. అక్టోబర్ 21 1959 తేదీన చైనా బోర్డర్లో 10 మంది జవాన్ల దేశ సేవలో ప్రణ త్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటాం.గత సంవత్సరం దేశ సైనిక భద్రతలో 261 మంది పోలీస్, కేంద్ర బలగాల అమరవీరులువీధి నిర్వహణ లో తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని ఈ సందర్భంగా అమరవీరులకు జోహార్లు తెలియజేసారు. ఇందులో ఆరు గురు సిఐఎస్ఎఫ్ జవాన్లు కూడా వున్నారు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కమాండెంట్ అఖిలేష్ కుమార్ తో పాటు ఇన్స్పెక్టర్ పీకే నందు, సంజీవ్ సిరోని, సంజీవ్ కుమార్, కృష్ణారావు, హెడ్ కానిస్టేబుల్ దశరథ రెడ్డి తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.