
*46 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేత
తెలంగాణ మిర్రర్, పటాన్‌చెరు : అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ యావత్ దేశంలోనే ఆదర్శంగా నిలస్తున్నారని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం పటాన్‌చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలంలో పలు గ్రామాలకు చెందిన 46 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను శాసనసభ్యులు అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ..ఆడపిల్లలు పెళ్లిళ్లకు నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారని, పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రూ. 46లక్షలను లబ్ధిదారులకు అందజేశామన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి ఆడపిల్ల పెండ్లికి భరోసా కల్పించేందుకే ఈ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారులకు చెక్‌ల ద్వారా నగదు బదిలీ జరుగుతున్నదన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఆడబిడ్డ పెండ్లికి అండగా నిలుస్తున్నామన్నారు. ఆడపిల్లలకు కేజీ టు పీజీ వరకు ఉచిత చదువు చెబుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,తెరాస కార్యకర్తలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.