Home » పేదలకు యాజమాన్య హక్కుల పట్టాలను అందజేసిన విప్ గాంధీ

పేదలకు యాజమాన్య హక్కుల పట్టాలను అందజేసిన విప్ గాంధీ

by Admin
9.4kViews
79 Shares
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : గూడులేని నిరుపేదలకు సీఎం కేసీఆర్ జీవో నెంబర్ 58, 59 ప్రకారం క్రమబద్దీకరణ చేసి వారి జీవితాల్లో భరోసా కల్పించారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్, భారతి నగర్ డివిజన్ల పరిధిలో 58, 59 కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన 30మంది పేదలకు యాజమాన్య హక్కులకు సంబదించిన పత్రాలను సోమవారం మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తహశీల్దార్ వంశీ మోహన్, డిప్యూటీ తహశీల్దార్ శంకర్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి విప్ గాంధీ అందజేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పేదల సంక్షేమమే ద్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని,సొంత గూడుకు సంబదించిన యహమాన్య హక్కుల ద్వారా వారి కండ్లలో ఆనందాన్ని నింపుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ స్థలాల్లో యాజమాన్య హక్కులను కలిపిస్తామని విప్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్ సలీం, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ , వాలా హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిద్దెల మల్లారెడ్డి పాల్గొన్నారు.

You may also like

Leave a Comment