Home » పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి

పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి

by Admin
1.3kViews

*సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధాశ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసనలు,రాస్తారోకో 

*ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మల దగ్ధం 

తెలంగాణ మిర్రర్,రామచంద్రపురం : పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ రామచంద్రపురం పట్టణంలోని జాతీయ రహదారిపై సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు  కాట సుధాశ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ మహిళా అధ్యక్షురాలు సునీత రావు ,డీసీసీ అధ్యక్షురాలు నిర్మలజగ్గారెడ్డి అధ్యక్షతన శనివారం పెరిగిన పెట్రోల్, డీజిల్, సిలిండర్, నిత్యావసర ధరల పెంపుపై ఆందోళన నిర్వహించారు.వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.అనంతరం ప్రధాని మోడీ,సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శాంతమ్మ,ఉపసర్పంచ్ శోభక్రిష్ణ, జయమ్మ, సత్యవతి,కౌన్సిలర్లు సునీత, సంతోష, లావణ్య శశిధర్ రెడ్డి, నాయకులు సతీష్ గౌడ్,ఈశ్వర్ సింగ్, హబీబ్ జానీ,అయాజ్, పీటర్, నగేష్, నవీన్,అజారుద్దీన్,రాంజీ,రసూల్,మీరజ్,సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment