Home » పెంచిన పెట్రోల్,డీజిల్,గ్యాస్,విద్యుత్,నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ధర్నా

పెంచిన పెట్రోల్,డీజిల్,గ్యాస్,విద్యుత్,నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ధర్నా

by Admin
1.2kViews

*కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన, రాస్తా రోకో*

ప్రధాని మోడీ,సి ఎం కేసీఆర్ ల దిష్టి బొమ్మలు దగ్ధం 

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఆరోపించారు.టీపీసీసీ పిలుపు మేరకు సోమవారం పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో  పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్,నిత్యావసర ధరలను వ్యతిరేకిస్తూ పటాన్‌చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు.ఈ నిరసన కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇంఛార్జ్ గాలి అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్ సపాన దేవ్,సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్,ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఛైర్మెన్ అనిల్ రెడ్డిలు పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారువెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీ,సీఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.ప్రభుత్వ విధానాలతో సామాన్య ప్రజలకు బతుకలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా పెంచిన పెట్రోల్,డీజిల్,గ్యాస్, విద్యుత్,నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.ధరలను పెంచుతూ ప్రజలకు మరింత కష్టపెడుతున్నారని మండి  పడ్డారు. పెంచిన ధరలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కాట శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ మండల్ ప్రెసిడెంట్స్ శ్రీకాంత్ రెడ్డి, వీరారెడ్డి, భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి మైనారిటీ ఛైర్మెన్ హబీబ్ జానీ, ఎస్ సి సెల్ డిపార్ట్మెంట్ యాదగిరి, మహేష్, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment