
1.4kViews
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సినిమా విడుదల నుండి మంచి టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ పరంగా అదరగొట్టింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.300 కోట్లు దాటేసి విజయవంతగా దుసుకెళ్తుంది. ఈ సంక్రాంతి పండగ సందర్బంగా ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో పుష్ప విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి 7న రాత్రి 8గం.ల నుండి స్త్రీమింగ్ కానుందని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా తెలిపింది. పుష్ప సినిమా స్త్రీమింగ్ కోసం అమెజాన్ ప్రైమ్ ఏకంగా 22కోట్లు చెల్లించినట్లు సమాచారం. హిందీ బాష మినహాయించి అన్ని భాషల్లో ఒకేసారి స్త్రీమింగ్ కానుంది.