
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్ : దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. 18 ఏళ్ళు నిండినవారు చాలా వరకు రెండు డోసుల టీకాను తీసుకున్నారు. దీనిలో భాగంగా 15 నుండి 18 సం. వయస్సు గల పిల్లలకు కరోనా వాక్సిన్ పంపిణీ జరుగుతుంది. తెలంగాణ లో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలు సుమారు 22 లక్షల మంది ఉన్నారు. టీకా ప్రారంభించిన తొలి రోజే 24,240 మంది పిల్లలకు కరోనా వాక్సిన్ వేయడం జరిగింది. తెలంగాణ లో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు, 12 మున్సిపాల్ కార్పొరేషన్ లలో కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్యా సేతు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తెలంగాణ లో మిగిలిన ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ అవసరం లేదు. నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆర్భన్ పి ఎచ్ సి లలో వాక్సిన్ వేసుకోవాలి. టీకా వేసుకునే సమయంలో ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, స్కూల్ ఐడి కార్డు లను చూపించి టీకా వేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది ప్రభుత్వం. పిల్లలకు కొవాక్సిన్ మాత్రమే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలకు కుడా 0.5 ml డోస్ ఇస్తారు. మొదటి డోస్ తీసుకున్నారు 4 వారలకు రెండోవ డోస్ తీసుకోవాలి.