Home » పాషా నగర్,ఎస్.సి బస్తీలోపర్యటించిన కార్పొరేటర్ పుష్పనగేష్

పాషా నగర్,ఎస్.సి బస్తీలోపర్యటించిన కార్పొరేటర్ పుష్పనగేష్

by Admin
1.3kViews

*బస్తీలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తానని హామీ..

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : రామచంద్రాపురం డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ అన్నారు.డివిజన్ పరిధిలోని పాషా నగర్ కాలనీ,ఎస్.సి బస్తీ 3వ బ్లాక్ లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని స్థానికుల పిర్యాదు మేరకు మంగళవారం ఆమె పర్యవేక్షించారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గతంలో తానూ వేయించిన ఓపెన్ డ్రైన్ పనులు మధ్యలోనే ఆపేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ విషయంపై అధికారులను సంప్రదించగా నూతనంగా పైప్ లైన్ పనులను చేపట్టాలని చెప్పారు.ఈ విషయం జోనల్ కమీషనర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను త్వరితగతిన పరిష్కారిస్తానని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.అనంతరం 3వ బ్లాక్ లోపర్యటించి సమస్యలను తెలుసుకున్నారు.గత 15 సంవత్సరాల క్రితం వేసిన డ్రైనేజ్ వల్ల పైప్ లైన్ దెబ్బతిని ఇళ్లలోకి డ్రైనేజీ నీరు చేరుతుందని బస్తీ వాసులు తెలపడంతో సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ జలమండలి అధికారులతో మాట్లాడి భూగర్భ డ్రైనేజీ పనులు మంజూరు చేయిస్తానని, అదేవిధంగా బస్తీలో సీసీ రోడ్లు వేయిస్తానని కాలనీ వాసులకు కార్పొరేటర్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో చాంద్ భాషా,అప్పల భాస్కర్,బ్యాండ్ శీను,సీఎం మల్లేష్,కైతలాపురం శీను తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment