
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని,మరోసారి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు జరగాలని ఆదివారం మియాపూర్ కల్వరీ టెంపుల్ లో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీ, కూకట్ పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణారావు,ఎమ్మెల్సీ నవీన్ రావుతో కలిసి మంత్రి కేటీఆర్ ఉదయకాలపు ఆరాధనలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. కల్వరీ టెంపుల్ అధినేత బ్రదర్ సతీష్ కుమార్ ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఆశీర్వదించారు. దేవుడి ఆశీర్వాదం, ప్రజల సహకారంతో ఈ ఎన్నికల్లో మరోసారి బీఆర్ ఎస్ గెలుస్తుందని, అన్ని సంఘాలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రజలంతా బీఆర్ఎస్ వెంట ఉన్నారని అన్నారు. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి ఆరేకపూడి గాంధీని, కూకట్ పల్లిలో కృష్ణారావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని క్రైస్తవ సమాజాన్ని కేటీఆర్ కోరారు.