Home » పార్టీకి కార్యకర్తలే బలం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పార్టీకి కార్యకర్తలే బలం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

by Admin
1.0kViews

 

*తెరాస కార్యకర్తల కుటుంబాలకు రూ. 10లక్షల బీమా సొమ్మును అందజేసిన ఎమ్మెల్యే 

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పటాన్‌చెరు పట్టణంలో అకాల మరణం పొందిన ఐదుగురు టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకు రూ. 2లక్షల చొప్పున బీమా డబ్బులకు సంబదించిన చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం వద్ద ఐదుగురు కార్యకర్తలకు కలిపి రూ. 10లక్షల బీమా సొమ్మును వారి కుటుంబ సబ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్యకర్తలకు ప్రమాద బీమా చేయించి, వారికి అండగా నిలుస్తున్న పార్టీ టీఆర్‌ఎస్‌ అన్నారు. ప్రతి కార్యకర్త ఇంటికి సీఎం కేసీఆర్ పెద్ద దిక్కులా ఉంటారని అన్నారు . సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో కార్యకర్తల కుటుంబాలకు బీమాతో రక్షణ కల్పించారన్నారు. రోడ్డు ప్రమాదాల్లో, హఠాత్తుగా మరణించిన కార్యకర్తల కుటుంబాలకు రూ. 2లక్షల ఇన్సురెన్స్‌ సొమ్ము వస్తుందన్నారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసే పార్టీ మాదే అని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 60లక్షల మంది కార్యకర్తలకు బీమా చేయించి రక్షణ కల్పించడం జరిగిందన్నారు. పార్టీకి కార్యకర్తలే బలమని గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, గుమ్మడిదల జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌, భారతీనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ సింధు ఆదర్శ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు చంద్రారెడ్డి, వెంకటేశంగౌడ్‌, హనుమంత్‌రెడ్డి, విజయ భాస్కర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, షేక్‌ హుస్సేన్‌, రాజేశ్‌, శ్రీనివాస్‌రెడ్డి, ప్రకాశ్‌చారీ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment