
తెలంగాణ మిర్రర్, గచ్చిబౌలి: కరోనా నియంత్రణ చర్యల్లో నిరంతరం విశ్రాంతి లేకుండా పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు అందజేసిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ఫ్రంట్ వారియర్స్ గా నిలబడి ప్రజలకు సేవలు అందించిన ప్రతి ఒక్క పారిశుధ్య కార్మికులకు అభినందనలు తెలియజేశారు. ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో పారిశుద్ధ్య కార్మికులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఇంత కష్టకాలంలో వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి మనకోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని, రోజువారీగా కరోనా కేసులు పెరుగుతుండటంతో వారి ఆరోగ్య భద్రతా దృష్ట్యా వారికి పీపీఈ కిట్లుఅందజేయటం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. రోజు రోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని వారు అన్నారు. ప్రజలు జాగ్రత్తగా వుండాలని, బయటకు వస్తే తప్పకుండా మాస్క్ ధరించాలని, ఒకరికి ఒకరు దూరం పాటించాలని సూచించారు. అలాగే కార్మికులు కూడా తమ స్వీయ భద్రతతో విధులను నిర్వహించాలని, తగిన రక్షణ ఏర్పాట్లతో మాత్రమే పనులను చెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, జీహెచ్ఎంసీ ఎస్ ఆర్ పీ భరత్, జి.హెచ్.ఎం.సి శానిటేషన్ సూపర్వైజర్ రాఘు , నగేష్ కిరణ్ కార్యకర్తలు పాల్గొన్నారు.