
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మియాపూర్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు వసుందర సమక్షంలో బండి రమేష్ సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత బస్ పాసుల పంపిణీ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ముఖ్య అతిధిగా హాజరై మియాపూర్ బస్ డిపో మేనేజర్ శంకర్ రావుతో కలిసి విద్యార్థులకు ఉచిత బస్ పాసులను అందజేశారు..ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయురాలు వసుందర మాట్లాడుతూ పాఠశాలలో త్రాగు నీరు సమస్య ఉందని, టాయిలెట్స్,అదనపు తరగతుల గదులను ఏర్పాటు చేయాలనీ బండి రమేష్ ను కోరామని చెప్పారు.ఈ సందర్బంగా బండి రమేష్ మాట్లాడుతూ పాఠశాలలో త్రాగు నీటి కోసం మంజీరా వాటర్ పైప్ లైన్ లను వేయిస్తామని అన్నారు. అదేవిధంగా పాఠశాలలో టాయిలెట్స్ ను బండి రమేష్ సేవ సంస్థ ద్వారా పరిష్కారిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సోమ సుందర్ ట్రస్ట్ చేస్తున్న సేవలను అభినందించారు.పేద కుటుంబాల్లోని విద్యార్థులకు చదివే భవిష్యత్తుకు ఆధారమని తెలిపారు. ప్రభుత్వం, దాతలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకుని వద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గంగారం సంగారెడ్డి, నర్సింగ్ రావు, తెప్ప బాలరాజు ముదిరాజ్ ,శేఖర్ గౌడ్ , కాకర్ల అరుణ, సిల్వర్ మనీష్, సత్యారెడ్డి , అంజద్ అమ్ము, రవీందర్రావు, రవణ బిఆర్ యువసేన పాల్గొన్నారు.