Home » పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి

పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి

by Admin
1.4kViews

తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి: మండల పరిధిలో పర్వేద గ్రామంలో పశువైద్యాధికారి డాక్టర్ జయసుధ ఆధ్వర్యంలో    సోమవారం పశు వైద్య శిబిరం నిర్వహించి పశువులకి టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తప్పనిసరి గా టీకాలు వేయించాలని, పశువులకి సోకె వివిధ వ్యాధుల పట్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశువులకి వ్యాధి సోకితే పాలఉత్పత్తి తగ్గిపోతుందన్నారు. అదేవిదంగా      గ్రామ సర్పంచ్ అనిత సురేందర్ గౌడ్ మాట్లాడుతూ రైతులందరు తమ పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పకుండా వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపిటిసి వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ ఏలయ్య, గ్రామ సెక్రెటరీ సుకుమార్ రెడ్డి, వార్డ్ మెంబర్ రవి, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment