
తెలంగాణ మిర్రర్,వికారాబాద్ : పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ సునితారెడ్డి అన్నారు . బుధవారం హిందూ జనశక్తి మరియు మాణిక్ ప్రభు సంస్థాన్ ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత “గిరి” ప్రదక్షిణ అనంతగిరి కొండల చుట్టూ 25 కిలోమీటర్లు ఆధ్యాత్మిక పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాణిక్ ప్రభు సంస్థాన్ పీఠాధిపతి బాల మార్తాండ మహరాజ్ ,హిందూ జనశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు లలిత్ కుమార్ లతో పాటం ఆమె పాల్గొని మాట్లాడారు . అడవుల రక్షణ కోసం నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మికత జోడించడం స్వాగతించాల్సిన విషయమని చెప్పారు . అంతరించి పోతున్న అడవులను ప్రజలందరు ఇప్పుడు మేల్కొని ఇప్పుడు కాపాడుకొకపోతే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలు క్షమించరని హెచ్చరించారు . పర్యావరణాన్ని ఆధ్యాత్మిక కోణంలో చూస్తూ అడవులను వృక్ష సంపదను కాపాడుకోవాలన్నారు. ఈలాంటి కార్యక్రమాన్ని నడుపుతున్న హిందూ జనశక్తి మరియు మాణిక్ ప్రభు సంస్థాన్ లను అభినందించారు.భవిష్యత్ లో ఈలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా కొనసాగించి ముందుకు వెళ్లాలని సూచించారు.ఈ సందర్భంగా హిందు జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ మాట్లాడుతూ సనాతన సాంప్రదాయంలో వృక్షాలను అడవి సంపదను దేవుళ్ళుగా భావించి పూజించే సాంప్రదాయం ఉందన్నారు. అటవీ సంరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చెపట్టడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం అడవుల రక్షణలో భాగంగా హరితహరం పథకంలో గ్రామాలలో పెంచే చెట్లు ఇప్పుడు అడవుల్లో పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, ఎమ్యెల్యే మెతుకు ఆనంద్, టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి , ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ కొకట్ మాధవరెడ్డి,హిందు జనశక్తి జిల్లా అధ్యక్షులు సార జగన్, బిజేపీ రాష్ట్ర నాయకులు శివరాజ్,విజయ భాస్కర్ రెడ్డి ,బీజేపి జిల్లా అధ్యక్షులు సదానంద్ రెడ్డి . , పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి , నాయకులు పోకల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ముగిసిన గిరి ప్రదక్షిణ…హిందు జనశక్తి , మాణిక్ ప్రభు సంస్థాన్ ల ఆద్వర్యంలో ప్రతీ ఎటా నిర్వహించే అనంత గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక పాదయాత్ర బుధవారం ఘనంగా ముగిసింది . ఉదయం ఆరుగంటలకు అనంతగిరి లోని రాజీవ్ నగర్ భవాణి మాత ఆలయం వద్ద పప్రారంభమైన పాదయాత్ర అనంతగిరి కొండల చుట్టు సాగుతూ గోధుమ గూడ , కేరెళ్లి బుగ్గరామ లెంగేశ్వర దేవస్తానం నుండి బండభావి హనుమాన్ దేవస్తానం గుండా అనంత పద్మనాభ స్వామి ఆలయం చేరుకుంది .ఈ కార్యక్రమంలో లో హైదరాబాద్ , బీదర్ ల ప్రాంతాల తో పాటు వికారాబాద్ జిల్లా నలుమూలల నుండి ,ఇతర జిల్లాల ప్రజలు వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు .