Home » పరిశుభ్రతకు ప్రాధాన్యత : ప్రభుత్వ విప్ గాంధీ

పరిశుభ్రతకు ప్రాధాన్యత : ప్రభుత్వ విప్ గాంధీ

by Admin
400Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి లోని అన్ని డివిజన్ లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరేకపూడి గాంధీ అన్నారు.మంగళవారం చందానగర్ పరిధిలోని చందానగర్,మియాపూర్,మాదాపూర్,హఫీజ్ పేట్ డివిజన్ లకు చెందిన లబ్దిదారులకు 34 స్వచ్ఛ ఆటోలను డీసీ సుధాంషు,    ఎఎమ్ఓహెచ్ డా.కార్తీక్,కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్,జగదీశ్వర్ గౌడ్,మంజుల రఘునాథ్ రెడ్డి లతో కలిసి ఎమ్మెల్యే గాంధీ అందజేసి ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు.చాలా ప్రదేశాలలో స్వచ్ఛ ఆటోలు చెత్తను సేకరిస్తున్నాయన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా చెత్త సేకరణ ఆటోలు, రిక్షాలు ఏర్పాట్లు చేశామని చెప్పారు.ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ చెత్త వేయొద్దని సూచించారు.చెత్తను తడి,పొడిగా ఇవ్వడంతో అందరి ఆరోగ్యాలకు మేలు జరుగుతుందని అన్నారు .పరిసరాల పరిశుభ్రతకు అవసరమైతే మరిన్ని ఆటోలు తీసుకొస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ పి లు శ్రీనివాస్ రెడ్డి ,మహేష్,కనకరాజు, ప్రసాద్,బాలాజీ హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్,తెరాస నాయకులు మాధవరం గోపాల్, గుమ్మడి శ్రీనివాస్, రాంచందర్,రవీందర్ రెడ్డి ,అక్బర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment