
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ‘బి’ బ్లాక్ లో రూ. 1 కోటి 55 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న వరద నీటి కాల్వ నిర్మాణ పనులను ఇంజనీరింగ్ విభాగం అధికారులు , కార్పొరేటర్ హమీద్ పటేల్తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పరిశీలించారు.ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ ప్రజా అవసరాల దృష్ట్యా వరద నీటి కాల్వ విస్తరణ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని,వరద నీటి కాల్వ నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుడదని పనులలో వేగం పెంచాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.వరద నీటి కాల్వ నిర్మాణ పనుల పై పలు సూచనలు,సలహాలు ఇవ్వడం జరిగినది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతలు ,నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కల్గకుండా సన్నద్ధం కావాలని,ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముంపుకు గురికాకండా ముందస్తుగా తగు చర్యలు తీసుకోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్,డీఈ రమేష్ వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్ , తెరాస నాయకులు తిరుపతి ,రమేష్ ,రూప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.