Home » పద్య నాటిక రచనలో శర్మకు రాష్ట్ర స్థాయి ప్రథమ బమతి

పద్య నాటిక రచనలో శర్మకు రాష్ట్ర స్థాయి ప్రథమ బమతి

by Admin
9.4kViews
109 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : ప్రజా -పద్యం ఆధ్వర్యంలో ఆధునిక సామాజిక స్పర్థ నిర్వహించిన పద్య నాటిక రచన పోటీలలో శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్‌ హెచ్‌ఎంటీ స్వర్ణపురికి చెందిన విశ్రాంత మండల విద్యాధికారి, ప్రముఖ కవి , రచయిత కటకం వెంకటరామ శర్మకు రాష్ట్ర స్థాయి ప్రధమ బమతి లభించింది. ఈ మేరకు ఆదివారం కూకట్‌పల్లిలోని భారత వికాస పరిషత్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‍లో నిర్వహించనున్న కార్యక్రమంలో శర్మ ప్రముఖ రంగ స్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ, సినీ గేయ రచయిత శ్రీ సిరాశ్రీల చేతుల మీదుగా బమతి ప్రదానం చేయనున్నారు. తెలుగు భాషాభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రజా-పద్యం సంస్థ ఈ పోటీలను ఈ ఏడాది జనవరిలో నిర్వహించింది. తెలంగాణ ,ఆంద్ర ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి సుమారు 100 వరకు ఎంట్రీలు వచ్చాయి. వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన నిర్వహకులు , 21 ఎంట్రీలను పరిగణనలోకి తీసుకున్నారు. వాటిపైనా లోతుగా అధ్యయనం చేసిన న్యాయ నిర్ణేతలు ఎసీపీ శాస్త్రి, మత్తి భానుమూర్తి, అవసరాల వెంకట్రావ్‌లు అందిన ఎంట్రీలలో మియాపూర్‌కు చెందిన విశ్రాంత విద్యాధికారి కటకం వెంకట్రామ శర్మ రచించిన ‘బృహన్నర’ నాటకం ఉత్తమమైన రచనగా గుర్తించారు. ఈ మేరకు కటకం వెంకటరామ శర్మకు తెలుగు రాష్ట్రాలలో ప్రథమ బమతిని ప్రకటించారు. ప్రథమ బమతితో పాటు రూ. 5 వేల నగదు ప్రోత్సాహకంగా అందివ్వనున్నారు. కాగా ప్రజా పద్యం నాటక రచనలో ప్రథమ బమతి సాధించిన శర్మను ప్రజా పద్యం నిర్వహకులు నారుమంచి వెంకట అనంత కృష్ణ, మారేపల్లి వెంకట పట్వర్ధన్‌, వీఆర్‌ గణపతి సహా ఇతర రచయితలు అభినందించారు.

You may also like

Leave a Comment