Home » పట్నం మహేందర్ రెడ్డి జనరల్ ఆస్పత్రిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

పట్నం మహేందర్ రెడ్డి జనరల్ ఆస్పత్రిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

by Admin
1.1kViews

తెలంగాణ వ్యాప్తంగా 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. చేవెళ్ల లోని డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జనరల్ ఆస్పత్రిలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి జాతీయ జండాను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమం స్ఫూర్తి ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. సత్యం, శాంతి,అహింస, సోదర భావం ఇలాంటి గాంధీ జీ ఆదర్శ మార్గాన్ని అనుసరించి కులమతాలకు అతీతంగా రాష్ట్ర, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. లోకమాన్య తిలక్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అంబేద్కర్ లాంటి మహనీయుల త్యాగాలను, వాలు నడిచిన మార్గాన్ని మరవద్దు అని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర స్థాపన కోసం సీఎం కేసీఆర్ గాంధీ మార్గంలో శాంతియుత ఉద్యమాన్ని నడిపి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, నేడు బంగారు తెలంగాణ దిశగా బాటలు వేస్తున్నారని మహేందర్ రెడ్డి తెలిపారు.

You may also like

Leave a Comment