Home » పటాన్‌చెరు నియోజకవర్గంలో ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవం…

పటాన్‌చెరు నియోజకవర్గంలో ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవం…

by Admin
1.2kViews

*స్వామి వారిని దర్శించుకొని  ప్రత్యేక పూజలు నిర్వహించిన నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదివారం పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గం పరిధిలోని చిట్కుల్ గ్రామంలోని వడ్డెర కాలనీ,అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీ, రామచంద్రపురం పట్టణంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవాల్లో కాట శ్రీనివాస్ గౌడ్ హాజరై స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయనను శ్రీరామ భజనలతో కూడిన ఆధ్యాత్మికత వాతావరణంలో సాదరంగా ఆహ్వానించారు.అనంతరం అయన మాట్లాడుతూ సీతారామ చంద్రుల కరుణా కటాక్షాలు, ఆశీస్సులు రాష్ట్ర,దేశ ప్ర‌జ‌ల‌పై ఉండాల‌ని, ప్ర‌జ‌లంద‌రూ సుఖ సంతోషాల‌తో ఉండేలా చూడాల‌ని శ్రీరామ చంద్రుడిని మనసారా కోరుకుంటున్నాని అన్నారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు.ఈ కల్యాణ మహోత్సవంలో చిట్కుల్ గ్రామానికి చెందిన ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, వార్డ్ మెంబెర్ యాదగిరి, వెంకటేష్ గౌడ్, దుర్గాప్రసాద్, నరసింహ చారీ, శ్రవణ్, సందీప్, శ్రీధర్,ఎల్లేష్,దశరథ్ ,అమీన్‌పూర్ మున్సిపాలిటీకి చెందిన మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, కౌన్సిల్లోర్స్ లావణ్య శశిధర్ రెడ్డి, మున్నా,విజయ్,నాయకులు శ్రీనివాస్,రవీందర్,రవి గౌడ్,మహేష్,రమేష్, రామచంద్రపురం పట్టణానికి చెందిన టౌన్ ప్రెసిడెంట్ మావీన్ గౌడ్,సతీష్ గౌడ్,అవినాష్ గౌడ్, ఈశ్వర్ సింగ్, హబీబ్, శ్రీరాములు, రంజీ, నవీన్, లక్ష్మణ్, గోపాల్, మణయ్య, వీరేష్, సత్యమయ్య, సత్తయ్య, మీరజ్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment