Home » పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

by Admin
1.2kViews

*అయిదు వేల మంది ముస్లిం సోదరులు హాజరు

*పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ,మెదక్ పార్లమెంట్ ఇంఛార్జ్ గాలి అనిల్ కుమార్

తెలంగాణ మిర్రర్,రామచంద్రపురం : రంజాన్‌ పర్వదినం పురస్కరించుకుని రామచంద్రపురం పట్టణంలోని ధర్మపురి ఫంక్షన్ హాల్ లో ఆదివారం సాయంత్రం ముస్లిం సోదరులకు పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈ ఇఫ్తార్‌లో సుమారు 5 వేల మంది ముస్లిం సోదరులు పాల్గొని విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ,మెదక్ పార్లమెంట్ ఇంఛార్జ్ గాలి అనిల్ కుమార్,కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముందు ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలు చేశారు.అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆత్మీయ భావం కలుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం,శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని కాట శ్రీనివాస్ గౌడ్ ఆకాంకింక్షారు.ముస్లింలంతా రంజాన్‌ను సంతోషంగా చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు,నాయకులకు శ్రీనివాస్ గౌడ్ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు నియోజకవర్గ ముస్లిం సోదరులు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు,టౌన్ ప్రెసిడెంట్స్ నాయకులు, యూత్ కాంగ్రెస్ సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

 

You may also like

Leave a Comment